పల్లవి
[అతడు][ఆమె] కాకినాడ కాజా కాజా కైకలూరు బాజాబాజ
కాణిపాకం గణపతి పూజ మనదేలే... ||కాకినాడ||
[ఆమె] కోటప్ప కొండపై పేరంటం
సింహాద్రి గుట్టపై సాయంత్రం
వెంకన్న కరుణతో కళ్యాణం మనదేలే
సిద్దాంతి పెట్టిన సుముహుర్తం
పెద్దోళ్ళు చెప్పిన సిద్దాంత
సిగ్గంతా జారగా శ్రమదానం మనదేలే.
లగ్గులాహిరే లగ్గు లాహిరే లగ్గు లాహిరే లగ్‌రే
లగ్గులాహిరే లగ్గు లగ్గు లగ్గులాహిరే ||2||కాకినాడ||
చరణం 1
[అతడు] చిన్నగుండెనే నీకు బండ చెయ్యనా
చిన్నవాడి ఆశలన్ని కట్టకట్టి కాలికే మెట్టె వేయనా
[ఆమె] కన్నె జన్మనే నీకు కట్నమివ్వనా
తాళలేని ప్రేమ పుట్టి తాళికట్టినప్పుడే తప్పకుండ తాళమెయ్యనా
[అతడు] ఓ...నీభామ చర్యలే ప్రారంభం నా బ్రహ్మచర్యమే గోవిందం
బ్రహ్మండమైన పరమానందం మనదేలే ||లగ్గులాహిరే||కాకినాడ||
చరణం 2
[ఆమె] మల్లెపూలతో - ఓ మాట చెప్పనా
పిల్లగాడు గిల్లుతుంటె గొల్లు గొల్లుమంటూ ఏడవొద్దని
[అతడు] వెండి మువ్వతో - నే విన్నవించనా
వేడిపుట్టి అల్లుకుంటే ఘల్లు ఘల్లుమంటూ
గుట్టు బైటపెట్టవొద్దని
[ఆమె] పడకింట నిండగా నిశ్శబ్దం
పెదవుల్లో పొంగగా కిశ్శబ్దం
అటుపైన జరిగిన అణూయుద్ధం మనదేలే ||లగ్గులాహిరే||