ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే

పల్లవి

[అతడు] ముద్దులాట ముద్దులాట ఇద్దరాడే ముద్దులాట
మద్యలో ఎవడొస్తే ఏంటట... Every body ||ముద్దు||
[అతడు] ఓసారి సయ్యాట ఓసారి పోట్లాట
ఓరెత్తే పడుచాట ఓడేది కాదు ప్రేమాట
అరె బేటా ఆరు నూరౌతున్నా ఆటాడేసుకో
అరె బేటా బొమ్మబొరుసౌతున్నా ప్రేమించేసుకో ||ముద్దు||

చరణం 1

[అతడు] పాఠశాల లేకున్నా పుస్తకాలు చూడకున్నా
పాకులాడి నేర్చుకున్న ఆట "సోకాట"
పక్కవాళ్ళు చూశ్తున్నా పొరుగువాళ్ళు వింటున్నా
పట్టనట్టు ఆడుకున్న ఆట "సొంతాట"
[ఆమె] ఏయ్ ఏంటి ఎక్కువ చేస్తున్నావ్ ఇదేం బాలేదు
ఇంకొంచెం ఎక్కువ చెయ్ బాగుంటుంది
[అతడు] తీయంగా పెదవాట న్యాయంగా నడుమాట
మౌనంగా మనువాట మరేదికాదు మనసాట
||అరెబేటా||

చరణం 2

[అతడు] ఎండలేవి లేకున్నా వానలేవి రాకున్నా
ఒకరినొకరు కమ్ముకున్న ఆట "గొడుగాట"
చీకటేళ కాకున్నా చందమామ రాకున్నా ఒకరినొకరు కప్పుకున్న ఆట "పడకాట"
[ఆమె] చీ చీ నువ్వెప్పుడు ఇంతే నీతో అస్సలు మాట్లాడను ఆట్లాడతాను
[అతడు] 'ప్రే' అంటే మొదలంట 'మ' అంటే చివరంట
ఈ రెండిటి నడి మధ్య ఆడాలి చూడు బ్రతుకాట ||అరెబేటా||