నిను చూస్తుంటే చెడిపోతానే

పల్లవి

[అతడు] నిను చూస్తుంటే చెడిపోతానే తప్పుకోవుకదా
[ఆమె] పొగిడావంటే పడిపోతానే తప్పని గొడవకదా
[అతడు] పద పద అంటోందే హాయ్ పదే పదే నీ అందం
[ఆమె] అహా మహా బాగుందే హాయ్ మతే చెడి ఆనందం
[అతడు] నురుగలెత్తే యవ్వనం తరుముతుంటే కాదనం
సనమ్ ఓ సనమ్ ||2|| నిను ||

చరణం 1

[అతడు] తీగ నడుము కదా తూగి తడబడదా
రేకు విరిసిన సోకు బరువుకు సాయపడమనదా
[ఆమె] ఆడ మనసుకద బైట పడగలదా
అంతసులువుగ అంతు దొరకదు వింత పొడుపు కథ
[అతడు] కబురు పంపిన పయ్యెదా ఇపుడు వెయ్యకు వాయిదా
సనమ్ ఓ సనమ్ ||2||నిను ||

చరణం 2

[అతడు] లేడి కన్నులతో వగలాడి వన్నెలతో
కంటపడి మహకొంటెగా కవ్వించు తుంటరివో
[ఆమె] వాడి తపనలతో మగవాడి తహ తహతో
జంట పడమని వెంటపడి వేధించు తొందరవో
[అతడు] పెదవి అంచున ఆగినా అసలు సంగతి దాగునా
సనమ్ ఓ సనమ్ ||2||నిను ||