పల్లవి
[కోరస్] పచ్చిపాల యవ్వనాల గువ్వలాట పంచుకుంటే రాతిరంతా జాతరంట
[అతడు] బుగ్గే బంగారమ సిగ్గే సింగారమా
అగ్గే రాజేసెలేమ్మా
ఒళ్ళే వయ్యారమా నవ్వే మందారమ్మా నన్నే కాజేసెనమ్మా
పట్టు చీరల్లో చందమామ ఏడువన్నెల్లో వెన్నెలమ్మ
కన్నె రూపాన కోనసీమ కోటితారల్లో ముద్దుగుమ్మ ||బుగ్గేబంగారమా||
చరణం 1
[అతడు]ఎదురే నిలిచే అదర మందుర దరహాసం
ఎదురై పిలిచే చిలిపి పడుచు మధుమాసం
వెలిగే అందం చెలికే సొంతం వసంతం మరమై
దొరికే అసలు సిసలు అపురూపం కలిసే వరకు
కలల్లో చెరిగే విహారం విషమసల మంచునీవో
భోగిమంటల్లో వేడినీవో పూలగంధాల గాలినీవో
పాలనురుగళ్ళో తీపినీవో ||బుగ్గే మందారమా||
చరణం 2
[కోరస్]నాగమల్లి పూవులతోన నంచుకున్న ముద్దులారా
సందిగాడి కొచ్చెగానె ఆరుబైట వెన్నెలెంతో
సత్తుకున్న కన్నెజంట సత్తిలాయనో ||2||
[అతడు] ఎదలో జరిగే విరహ సెగల వనవాసం
బదులే అడిగే మొదటి వలపు అభిషేకం
వదువై బిడియం వొదిగే సమయం
ఎపుడో జతగా పిలిచే అగరు పొగల సహవాసం
జడతో జగడం జరిగే సరసం ఎపుడో కన్నెపువ్వుల్లో
ఆమె నవ్వే అన్ని రంగుల్లో ఆమెరూపె అన్ని వేళల్లో
ఆమె ధ్యాసే నన్ను మెత్తంగ మాయచేసే ||బుగ్గే బంగారమా||