రేగుముల్లోలె నాటు చిన్నది

పల్లవి

[అతడు] రేగుముల్లోలె నాటు చిన్నది బొడ్డూ మల్లేను
చూడు అన్నది మీసాలు గుచ్చకుండా ఒరె బాబు
ముద్దాడతావా అంది
[ఆమె] కందిపువ్వోలె ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టి
పోతాను కుచ్చిళ్ళు జారకుండ ఒరెబాబు కౌగిళ్ళు
ఇవ్వు నువ్వు
[అతడు] నీనడుముకెంత పోగరబ్బ అదికదులుతుంటె వడదెబ్బ
నువు కెలకమాకు మనసబ్బ ఇకనిదురరాదు నీయబ్బ
మిసాలు గుచ్చకుండా

చరణం 1

[అతడు] కోనేటి నీళ్ళల్లో వంగిందిరో కుండల్లె నాగుండె
ముంచిందిరో తనుతడిసిందిరో ననుతడిపిందిరో
కొమ్మొంచి కాయేదో కోసిందిరో
అదిజాంపడులా తను తింటుందిరో
[ఆమె] నిదురే పడితే ఎదలో గుండెసూదల్లె దిగుతావురో
[అతడు] తన కనులు గిలికి సింగారి తనజడను విసిరివయ్యారి
చిరునగవు చిలికి ఒకసారి వసపెదవి కొరికి ప్రతిసారి
[ఆమె] మిసాలు గుచ్చకుండా ఒరె బాబు ముద్దాడతావా నువు

చరణం 2

[అతడు] ఆజొన్న చేలల్లో పక్కందిరో ఒళ్ళోన చెయ్యేస్తే సిగ్గందిరో
బులుపే తీరక కసి ఊరిందిర ఒసారి నాతోని సయ్యంటెరో
దాసోహమవుతాను నూరెళ్ళురో ఇకతనకాళ్ళకే పసుపు అవుతానురో
[ఆమె] ఇదిగో పిలగో నువు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
[అతడు] నీ నడుముపైన ఒక మడత్తె పై జన్మలోన ఇకపుడతా
అని చెలిమి చేరి మొరపెడితే తెగకులుకులొలికి ఆ చిలక
మిసాలు గుచ్చకుండా ఓసిబామ ముద్దడతావా నువు