దీందీంధనన దిరన దోందనన

పల్లవి

దీందీంధనన దిరన దోందనన దీందీంధనన ధరదినను ||2||
వందేమాతరం గాంధిఓంకారం ||2||
ఓ బాపు నువ్వేరావాలి నీసాయం మళ్ళీ కావాలి ||వందేమాతరం||
జరిగే దుర్మాంగం ఆపాలి నువ్వే ఓమార్గం చూపాలి ||వందేమాతరం||
కళ్ళజోడుతో చేతికర్రతో కదిలే ఓ సత్యాగ్రహం
||కోరస్|| కదిలే ఓ సత్యాగ్రహం వెండి కొండలా సిరసు పండినా
యువకుల మించిన సాహసం ||కోరస్||యువకుల మించిన సాహసం

బక్కపలచని బాపుగుండెలో తూగే హిమాచలం గుక్కునరాల్లో ఉప్పొంగే
స్వాతంత్ర్య రక్త గంగాజలం సత్యమార్గమున మడమతిప్పని స్వరాజ్య
దీక్షమానసం అతడంటే గడగడ వణికింది ఆంగ్లేయుల సింహాసనం
వందేమాతరం గాంధి ఓంకారం ||2||

చాకు.పిస్టల్.కొడవళి, గొడ్డలి ఎందుకు హింసాసాయుధం
||కోరస్|| ఎందుకు హింసాసాయుధం అవేశం కోపం ద్వేషం
కాదు చిరునవ్వే మన ఆయుధం ||కోరస్||చిరునవ్వే మన ఆయుధం
సాటి మనిషిపై ప్రేమేగా మన మాతృ భూమికి గౌరవం మానవతే మనకెన్నడు
చెరగని అందమైన గాంధీయుజం వందేమాతరం గాంధీ ఓంకారం ||2||
భయం చెందని నెత్తురు చిందని గాంధి మహోద్యమజ్వాలలు గాలి తరంగాలై
వీచినవి ఈదేశంలో నలుమూలలు వందేమాతరం గాంధి ఓంకారం ||4||