భూగోళమంతా సంచిలోన

పల్లవి

[అతడు] భూగోళమంతా సంచిలోన భోగోళమంతా సంచిలోన నాప్రేమనంతా
నింపుకొచ్చా అంగట్లో పూలన్ని పిల్లా మొత్తంగా పాడుకోచ్చా ఏయ్ నా
గుప్పెడంతా గుండెపైనా నీ చిట్టిపేరే రాసుకోచ్చా నీసోకు క్షేమంకే గుళ్ళో
ఆకుపూజ చేసుకోచ్చు
[ఆమె] బాపురే నాకోసం ఇంత లేనిపోని ఖర్చా ప్రేమలో ఈ పాఠం
ఏడనేర్చినావో నువ్వు చెప్పుకాస్తా
[అతడు] స్కూల్‌కెళ్ళి చదవలేదు ||2|| ఒన్.టు.త్రి.
[ఆమె] పలక పెట్ట దిద్దలేదు ఎ.బి.సి. ప్రేమ నేర్చినాడు అంట
నన్ను చూసి ||భూగోళమంతా||

చరణం 1

[అతడు] నీ అందమెంతో లేతలేత అది కందకంట కాపుకాస్తా నీ సుందరుల
మేనుకి సబ్బురుద్దడానికి చందురుడ్ని పట్టుకొస్తా నీవి దోరదోర వన్నెలంత
చేయిజారుకుంటు చూసుకుంటా నీ పాలరాతి బుగ్గకి మెరుగు దిద్దడానికి
తెలుపు నేను వెంటతెస్తా
[ఆమె] దేవుడో ఈట్రిక్స్ ఏడనేర్చినావో నువు చెప్పుకాస్తా ||స్కూల్‌కెళ్ళి చదవలేదు||

చరణం 2

[అతడు] నువ్వె నంట నాసీత అని రాసినాడు బ్రహ్మతాతా నువు మాయలేడినడి
నడిగిన శివుడు విల్లు నడిగినా విరగకుండ తీసుకోస్తా అరె నువ్వెనంట సత్యభామ
నిండు అలక నమ్మవమ్మా ||నువ్వు||
కంచిపట్టు చీరలడిగినా పర్సు చిల్లు అయినా-కిక్కుమనక పట్టుకొస్తా
[ఆమె] అయ్ బాబోయ్ ఈజోక్స్ ఏడనేర్చినావు నువ్వు చెప్పుకాస్తా ||స్కూల్‌కెళ్ళి||