చందమామ కోసమే

పల్లవి

[ఆమె] చందమామ కోసమే వేచిఉన్న రేయిలా వేయికళ్ళతోటి ఎదురుచూడనా
వాన జల్లు కోసమే వేచిఉన్న పైరులా గంపెడంత ఆశతోటి చూడనా జోలపాట కోసం
ఉయ్యాలలోన చంటిపాపలాగ కోడికూతకోసం తెల్లారుజాము పల్లెటూరిలాగ ఆగనే
లేనుగా చెప్పవా నేరుగా గుండెలో ఉన్నమాట హే ఒకట.రెండు.మూడు అంటు అరె
ఒక్కొక్షణాన్ని నేను లెక్కపెట్టనా వెళ్ళు వెళ్ళు వెళ్ళు అంటు ఈకాలాన్ని ముందుకే నేను తొయ్యనా

చరణం 1

[ఆమె] తొందరే ఉందిగా ఊహకైనా అందనంతగా కాలమా వెళ్ళవే తాబేలులాగ ఇంతనెమ్మదా
[అతడు] నీతో ఉంటుంటే నన్నే చూస్తుంటే రెప్ప వేయకుంటె చేపపిల్లలు కళ్ళేం వేయలేని ఆపే
వీల్లేని కాలం వెళ్తుందే జింక పిల్లలా
[ఆమె] అడిగితే చెప్పవు అలిగినా చెప్పవు కుదురుగా ఉండ నీవు ||ఒకటి.రెండు.మూడు||
[అతడు] మూడు.రెండు.ఒకటి అంటు గడియారాన్ని వెన్నక్కి నేను తిప్పనా

చరణం 2

[ఆమె] ఎందుకో ఏమిటో నిన్నమొన్న లేని యాతనా నామది ఆగదే నేను ఎంత బుజ్జగిజ్జినా
[అతడు] చీపో అంటావ నాతో ఉంటావో ఇంకెం అంటావో తెల్లవారితే విసుకుంటావో అతుకుంటావో
ఎలా ఉంటావో లేఖ అందితే
[ఆమె] ఇంక ఊరించకు ఇంతవేదించకు నన్నిలా చంపమాకు ||ఒకటి.రెండు.మూడు||