ముక్కుపై ముద్దు పెట్టు

పల్లవి

[ఆమె] ముక్కుపై ముద్దు పెట్టు ముక్కలై పోయేట్టు
చెంపపై ముద్దుపెట్టు చక్కెరై పోయేట్టు
[అతడు] మీసంపై ముద్దు పెట్టు మీదికే దూకెట్టు
గడ్డంపై ముద్దు పెట్టు గుండెనే తాకేట్టు

చరణం 1

[ఆమె] సగటు నుదిటి మీద ఒక్కబొట్టు ముద్దు ఆపిదప చెవికి చిన్న బుట్ట ముద్దు
[అతడు] మత్తు మెడకు ఒక్క మొక్కజొన్న ముద్దు
గమత్తు గొంతుకొక్క సన్నజాజిముద్దు
[ఆమె] బుగ్గ పండు కొరికేసే రౌడీ ముద్దు
కొంటె ఈడు కాజేసే కేడీ ముద్దు
[అతడు] కంత్రీ ముద్దు జగజంత్రీ ముద్దు ||2||
ముద్దు ముద్దు ముద్దు...ఆ ఆ ఆ ఆ

చరణం 2

[అతడు] వగల నడుము మడతమీద వడ్డానం ముద్దు
రేనాభా చుట్టు వేడిసెగల సిగ్గానం ముద్దు
[ఆమె] ఒంటి వన్నె చిన్నే విన్న పాలముద్దు పూవంటి కన్నెకొక్క జున్నుపాలముద్దు
[అతడు] అల్లరాణి వల్లకానియా అల్లరిముద్దు అల్లసాని మద్యమంత అల్లిక ముద్దు
[ఆమె] హాయిరప హాయి ముద్దు అది ఆంధ్రా ముద్దు
ఆవకాయ ముద్దు అది ఆంధ్రా ముద్దు