పల్లవి
[అతడు] రఫ్ ఆడే వయసు మాది లుక్కేస్తే ఫైరురో
చిందేసే మనసు మాది చింతే లేదురో ||రఫ్ ఆడే||
లేటెస్టు స్టైలు మాదిరో లైఫ్ స్టైలే వేరురో
సింపుల్‌గా సెంట నడగరో ఓ...ఓ...ఓ...
ధమ్ము రిధమ్ము రెండు కలిపి రఫ్ ఆడించేయ్‌రో
మారో మారో గోలీమారో అరె యారో యారో సునియారో
మారో మారో గోలీమారో రేపుందో లేదో తెలియదురో ఓ...లెట్స్ డు ఇట్
చరణం 1
[అతడు] హెయ్ భూమె గుండ్రం అన్నాడొకడు
అన్నోళ్ళంతా పిచ్చోడంటూ అన్నారపుడు
వేమన పద్యం చెప్పిననాడు విన్నోళ్ళంతా వెర్రోడంటూ చూసారపుడు
హొయ్ అవమానం పక్కనెట్టరో అవకాశం పట్టరో
అవరోధం దాటు కెళ్ళరో ఒహొ...
లోకం ప్రపంచం అలాగేనంటూ తలలే ఊపునురో.. ||మారోమరో||
చరణం 2
[అతడు]హే...బలముండాలి తెలివుండాలి
రెంటికి తోడు అంతో ఇంతో దిక్కుండాలి
హే...బాధుండాలి హాయుండాలి బాధల్లోనూ
హాయిగ నవ్వే ధమ్ముండాలి
హొ...ఏదున్న బయట పెట్టరో దాచేది లేదురో
కొంతైన పంచిపెట్టరో ఒహొ హొ హొ...
లోకం ప్రపంచం గులామె అంటూ వెంటే వచ్చునురో.. ||మారోమారో||