నీలాల కన్నుల్లో మెలమెల్లగా...

నీలాల కన్నుల్లో మెలమెల్లగా
నిదుర రావమ్మా రావే...
నిండారా రావే
నెలవంక చలువల్లు వెదజల్లగా
నిదుర రావమ్మా రావే నెమ్మదిగా రావే ||నీలాల||

చరణం 1

ఓ ఓ ఓ... చిరుగాలి బాల
పాడింది జోల పాడిందీ జోల
చిగురాకు మనసు కనుపాపలందు
ఎద దోచెనమ్మా ఏవేవో కలలు
కలలన్నీ కళలెన్నో విరబూయగా
నిదుర రావమ్మా రావే...
నెమ్మదిగా రావే ||నీలాల||

చరణం 2

ఓ ఓ ఓ... నిదురమ్మ ఒడిలో
ఒరిగింది రేయి ఊగిందీ లాలీ
గగనాన్ని చూసి ఒక కన్నుదోయి
వినిపించమంది ఎన్నెన్నో కధలు
కధ చెప్పి మురిపించి మరిపించగా
నిదుర రావమ్మా రావే...
నెమ్మదిగా రావే ||నీలాల||