తలచి తలచి చూశా వలచి విడిచి నడిచా
నీకై నేను బ్రతికే ఉంటిని... ఓ...
నీలో నన్ను చూసుకొంటిని
తెరచి చూసి చదువు వేళ
కాలిపోయే లేఖ బాలా... ||నీకై నేను||
చరణం 1
కొలువు తీరు తరువుల నీడ
నిన్ను అడిగె ఏమని తెలుప
రాలిపోయిన పూల మౌనమా...
రాక తెలుపు మువ్వల సడిని
దారులడిగె ఏమని తెలుప
పగిలిపోయిన గాజులు పలుకునా...
అరచేత వేడిని రేపే చెలియ చేతులేవి
ఒడిన వాలి కధలను చెప్ప సఖియ నేడు ఏది
తొలి స్వప్నం ముగియక మునుపే
నిదురే చెదిరెలే... ||తలచి||
చరణం 2
మధురమైన మాటలు ఎన్నో
మారుమోగె చెవిలో నిత్యం
కట్టె కాలు మాటే కాలునా
చెరిగిపోని చూపులు నన్ను
ప్రశ్నలడిగె రేయి పగలు
ప్రాణం పోవు రూపం పోవునా
వెంట వచ్చు నీడ కూడ మంట కలిసిపోవు
కళ్ళ ముందు సాక్ష్యాలున్నా నమ్మలేదు నేను
ఒకసారి కనిపిస్తావని బ్రతికే ఉంటినే..