రారయ్యా పోయినవాళ్ళు
ఎవరయ్యా ఉండే వాళ్ళు
నవ్వు మరచి నన్ను మరచి
ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళూ
రారయ్యా పోయినవాళ్ళు
చరణం 1
తొలిసారి చూశాను నీ కళ్లను
అవి చిలికాయి నవ్వుల వెన్నెలను ||తొలిసారి||
నిలువునా పులకించాను
కలువనై విరబూచాను
మసకేసిన చందమామను
ఏమని చూస్తాను
నేనేమైపోతాను ||రారయ్యా||
చరణం 2
నీ కళ్లకే కాదు కన్నీళ్లకూ
నే తోడు ఉంటాను ఏ వేళకూ
నీ మమతలే కాదు నీ కలతనూ
నే పంచుకుంటాను ప్రతి జన్మకూ ||నీ మమతలే||
||రారయ్యా||
చరణం 3
నిదురల్లె వస్తాను నీ కంటికి
చిరునవ్వు తెస్తాను నీ పెదవికి ||నిదురెల్లె||
అమ్మల్లె లాలించి అనురాగం పలికించు ||రారయ్యా||