జోలాజోలమ్మజోలా జేజేలా జోల...

జోలాజోలమ్మజోలా జేజేలా జోల జేజేలా జోల
నీలాలా కన్నులకు నిత్యమల్లె పూలజోల ||2||
ళొ ళొ... ళొ ళొ... ళొ ళొ...
హాయి... హాయీ ||2||

చరణం 1

రేపల్లె గోపన్న రేపు మరచి నిదరోయె ||2||
యాదగిరి నరసన్న ఆదమరచి నిదరోయె ||2||
ఏడుకొండలు ఎంకన్న ఎప్పుడనగా నిదరోయె ||2||
కోడెపిల్లడా నీకేమో కునుకైనా రాదాయె...
కునుకైనా... ||ళొ ళొ||
హాయి... హాయీ ||2|| ||జోలా||

చరణం 2

మీనావతారమెత్తి మేనిచుట్టూ రాబోకురా
అరెరె... యాహీ యాహీ యాహీ... ||2||
కృష్ణావతారమెత్తి కోకలెత్తుకు పోబోకురా
అయ్యయ్యయ్యో...
యాహీ... యాహీ... యాహీ...
వామనావతారమెత్తి ||2||
సామిలాగ అయిపోకు
బుద్ధావతారమెత్తి బోధిచెట్టును అంటి ఉండకు
రఘువంశ తిలకుడివై రాముడివై రమణుడివై ||2||
సీతతోనే ఉండిపోరా... గీత నువ్వే దిద్దిపోరా
ఈ సీతతోనే ఉండిపోరా నా గీత నువ్వే దిద్దిపోరా
||ళొ ళొ|| ||హాయి|| హాయీ ||2||