ఓ ఓ ఓ... గులాబీ ||2||
వలపు తోటలో విరిసిన దానా
లేత నవ్వుల... వెన్నెల సోన
చరణం 1
కొంటె తుమ్మెదల వలచేవు
జుంటి తేనెలందించేవు ||2||
మోసం చేసి మీసం దువ్వే
మోసకారులకు లొంగేవు లొంగేవు ||ఓహో||
చరణం 2
రూపం చూసి వస్తారు
చూపుల గాలం వేస్తారు ||2||
రేకుల చిదిమి... సొగసులు నులిమి...
చివరకు ద్రోహం చేస్తారు
చివరకు... ద్రోహం... చేస్తారు... ||ఓహో||