ఝుమ్మంది నాదం... సై అంది పాదం...

ఝుమ్మంది నాదం... సై అంది పాదం...
తనువూగింది ఈ వేళ...
చెలరేగింది ఒక రాసలీల... ||ఝుమ్మంది||

చరణం 1

ఎదలోని సొదలా ఎలదేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా ||ఎదలోని||
చలిత లలిత పద కలిత కవితలెద
సరిగమ పలికించగా...
స్వర మధురిమలొలికించగా...
సిరిసిరిమువ్వలు పులకించగా... ||నీతో||

చరణం 2

నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశి
నటియించు నీవని తెలిసీ ||నటరాజ||
ఆకాశమై పొంగె ఆవేశం
కైలాసమే వంగే నీకోసం ||ఝుమ్మంది||

చరణం 3

మెరుపుంది నాలో... అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో... అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా ||ఝుమ్మంది||