భావములోన బాహ్యమునందును...

భావములోన...
భావములోన బాహ్యమునందును ||2||
గోవింద.. గోవింద.. అని
కొలువ వో మనసా... ||భావము||

చరణం 1

హరియవతారములే అఖిల దేవతలు ||2||
హరిలోనివే బ్రహ్మాండంబులు ||హరి||
హరి నామములే అన్ని మంత్రములు ||3||
హరి.. హరి.. హరి.. హరి..
హరి యనవో మనసా... ||2|| ||భావము||

చరణం 2

విష్ణుని మహిమలే విహిత కర్మములు ||2||
విష్ణుని పొగడెడి వేదంబులు ||విష్ణుని||
విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు ||2||
విష్ణువు.. విష్ణువని వెదకవో మనసా ||2|| ||భావము||

చరణం 3

అచ్యుతుడితడే ఆదియునంత్యము ||2||
అచ్యుతుడే... అసురాంతకుడు ||అచ్యుతు||
అచ్యుడు శ్రీ వేంకటాద్రి మీదనిదె ||3||
అచ్యుత.. అచ్యుత శరణనవో మనసా ||2|| ||భావము||

శుద్ధ ధన్యాసి రాగం : ఆదితాళం