మనసే కోవెలగా మమతలు మల్లెలుగా
నిన్నే కొలిచెదరా..
నన్నెన్నడు మరువకురా కృష్ణా... ||మనసే|
చరణం 1
ఈ అనురాగం ఈ అనుబంధం మన ఇరువురి ఆనందం ||2||
కలకాలం మదినిండాలి కలలన్నీ పండాలి ||2||
మన కలలన్నీ పండాలి ||మనసే||
చరణం 2
ఎన్నో జన్మల పుణ్యముగా నిన్నేతోడుగా పొందాను ||2||
ప్రతీ రేయీ పున్నమిగా
బ్రతుకు తీయగా గడిపేను ||2|| ||మనసే||
చరణం 3
నీ చూపులలో చూపులతో నీ ఆశలలో ఆశలతో ||2||
ఒకే ప్రాణమై ఒకే ధ్యానమై
ఒకరికి ఒకరై బ్రతకాలి ||2|| ||మనసే||