నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస...

నువ్వంటే నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస
నువ్వేలే నా లోకమని అన్నది నా ప్రతి ఆశ
నీ నవ్వులో.. శ్రుతి కలిపి పాడగా
నీ నీడలో.. అణువణువు ఆడగా
అనురాగం పలికింది సంతోషం స్వరాలుగా ||నువ్వంటే||

చరణం 1

నువ్వు నావెంట ఉంటే అడుగడుగునా నడుపుతుంటే
ఎదురయే నా ప్రతి కలా నిజమల్లె కనిపించదా
నిన్నిలా చూస్తు ఉంటే మైమరపు నన్నల్లుకుంటే
కనపడే నిజమే ఇలా కలలాగ అనిపించదా
వరాలన్ని సూటిగా.. ఇలా నన్ను చేరగా..
సుదూరాల తారక.. సమీపాన వాలగా..
లేనేలేదు ఇంకే కోరికా.. ఆ... ||నువ్వంటే||

చరణం 2

ఆగిపోవాలి కాలం మన సొంతమై ఎల్లకాలం
నిన్నగా సన సన్నగా చేజారిపోనీయక
చూడు నా ఇంద్రజాలం వెను తిరిగి వస్తుంది కాలం
రేపుగా మన పాపగా పుడుతుంది సరికొత్తగా
నీవు నాకు తోడుగా నేను నీకు నీడగా
ప్రతీరేయి తీయగా పిలుస్తోంది హాయిగా
ఇలా ఉండిపోతే చాలుగా.. ఆ... ||నువ్వంటే||