లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి...

ఓ పిల్లా పిల్లా లస్కురి పిల్లా లగ్గోరిపిల్లా లడాయి పిల్లా
బడాయి పిల్లా సొగసరి పిల్లా సోకుల పిల్లా పిల్లా పిల్లా
లాలు దర్వాజా కాడి నా ముద్దుల రంభాయి
ఆ.. లాలు దర్వాజ కాడి నా ముద్దుల రంభాయి
లాలుగూడ లబ్బరు బొమ్మ నా ముద్దుల రంభాయి
లాలు లాలు పొట్టిరో లగజనక పట్టిరో
లబో దిబో బొమ్మరో లోలాకు బొమ్మరో

చరణం 1

రావే రావే పిల్లా రాలుగాయి పిల్లా ముందరుందే బ్రతుకు
ముందుకెయ్యవే అడుగు జింక ఎందుకు పిల్లో ఓ చిన్నదానా
చిందులెయ్యవో పిల్లా ఓ కుర్రాదానా
అడుగు వెయ్యాలంటే కాళ్ళు ఒణుకుతుండే
పెదవి విప్పాలంటే అదురుతుందీ గుండె
చెప్పలేని భయము ఆ... చిన్నావాడ
తొలచి వేస్తూ ఉందీ ఓ కుర్రావాడ
హే దమ్ములుంటే చాలే పిల్లా
రెండే రెండంట చావు బతుకంటా ఇంకేం లేదంటా
జీవితమంటే కలిసే బ్రతుకైనా కలిసే చావైనా వదలను నీ చేయి ఏదేమైనా
కలిసే బ్రతుకంట కలిసే చావంట వదలను నీ చేయి ఏదేమైనా
హే చార్మినారు చౌరస్తాలో నా ముద్దుల రాంబాబు
జాంబినేల వస్తివి పిల్లగో నా ముద్దుల రాంబాబు
లాలు లాలు పిల్లడో లల్లా పోరడు్
లొల్లి పెట్టే గుంటడు లవ్వంటూ వదలడు హే..హే..

చరణం 2

కట్టు కట్టు బండి జోడెడ్లా బండి
ఇంపైనా బండి ఇరుసెయ్యని బండి
బండెక్కెయ్ పిల్లగో ఓ చిన్న వాడ జోరుగెళ్ళ పిల్లగో ఓ కుర్రవాడ
మూల మలుపుల కాడ ఎత్తు వంపుల కాడ
జోడు కొండల కాడ మూత బావి కాడ
బండి భద్రం పిల్లో ఓ చిన్నదాన గుండె పదిలం పిల్లో ఓ కుర్రదాన
నువ్వే నా తోడై ఉంటే ఒక్క నవ్వు చాలు పట్టు వెయ్యి స్వర్గాలు
నీ గుండె సవ్వడినై ఉంటానంటా
ఒక్క నవ్వే చాలు గెలిచొస్తా లోకాలు
గుండె నిండా నువ్వే ఉంటానంతే ||2||