పిడికిటి తలంబ్రాల పెండ్లికూతురు...

పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత
పెడమరలి నవ్వీనీ పెండ్లికూతురు ||పిడికిట||

చరణం 1

పేరుగల జవరాలీ పెండ్లికూతురు - పెద్ద
పేరుల ముత్యాల మెడ పెండ్లికూతురు
పేరంటాండ్ల నడిమి పెండ్లికూతురు ||2||
విభు పేరు గుచ్చసిగ్గు వడీ పెండ్లికూతురు ||పిడికిట||

చరణం 2

బిరుదు పెండెము వెట్టె పెండ్లికూతురు నెర
బిరుదు మగని కంటే బెండ్లికూతురు
పిరిదూరినప్పుడే పెండ్లికూతురు పతి
బెరరేచి నిదివో పెండ్లికూతురు ||పిడికిట||

చరణం 3

పెట్టెనే పెద్ద తురుము పెండ్లికూతురు నేడె
పెట్టెడు చీరలు గట్టె బెండ్లికూతురు
గట్టిగ వేంకటపతి కౌగిటను వడి
వెట్టిన నధానమైన పెండ్లికూతురు ||పిడికిట||