పరితాప భారంబు భరియింప తరమా...

పరితాప భారంబు భరియింప తరమా
కటకటనే విధి గడువంగా జాలదు
పతి ఆజ్ఞను దాటగలనా
పుత్రుని కాపాడగలనా... ||పరి||

ఈ విషము నేనెటులను
తనయుని త్రావింపగలను?
ధర్మము కాపాడుదునా?
తనయుని కావగగలనా?... ||పరి||