ప్రియా ప్రియతమా రాగాలు...

ప్రియా ప్రియతమా రాగాలు
సఖీ కుశలమా అందాలు ||2||
నీ లయ పంచుకుంటుంటే
నా శ్రుతి మించిపోతుంటే నాలో.. రేగే.. ||ప్రియా||

చరణం 1

జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు
పెదాల మూగ పాటలో పదాలు పాడే ఆశలు
ఎదురులేని మనసులో ఎదురురావే నా చెలి
అడుగుజారే వయసులో అడిగి చూడు కౌగిలి
ఒకే వసంతం కుహూ నినాదం
నీలో నాలో పలికే.. ||ప్రియా||

చరణం 2

శరత్తులోన వెన్నెలా తలెత్తుకుంది కన్నులా
షికారుచేసే కోకిలా పుకారువేసే కాకిలా
ఎవరు ఎంత వగచినా చిగురువేసే కోరిక
నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక
మదే ప్రపంచం విధే విలాసం
నిన్ను నన్ను కలిపే.. ||ప్రియా||