ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన
అంత మాత్రమే నీవు ||4||
అంతరాంతరములెంచి చూడ
పిండంతేనిప్పటి అన్నట్లు ||3|| ||ఎంత||
చరణం 1
కొలుతురు మిము వైష్ణవులు
కూరిమితో విష్ణుడని ||2||
పలుకుదురు మిము వేదాంతులు
పరబ్రహ్మంబనుచు ||2|| ||ఎంత||
చరణం 2
సరి నెన్నుదురు శాక్తేయులు
శక్తిరూపిణి నీవనుచు
దరిశనములు మిము నానావిధులను
తలపుల కొలదుల భజింతురు ||సరి||
సిరుల మిము నే అల్పబుద్ధి దలచిన
ఘన బుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు
మరి నీరు కొలది తామెరవు
ఆవల భాగీరధి దరి బావుల
ఆ జలమే ఊరినయట్లు ||నీవలన||
శ్రీ వేంకటపతి నీవైతే
మము చేకొని ఉన్న దైవమని ||2||
ఈవల నే నీ శరణననెదను
ఇదియే పరతత్త్వము నాకు ||4||
బృందావని, మాయామాళవగౌళ రాగమాలిక మిశ్రచాపుతాళం