సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి...

సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి
మొగ్గ... మొగ్గ.. తన... మొగ్గ... ఆ...
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి ||3||
మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచ్చి
సొగసు సంపెంగ గుత్తులు మెత్తగ తాకంగా ||2||
రాముని సిత్తంలో కాముడు సింతలు రేపంగా
సిగ్గూ పూబంతి ఇసిరే సీతామాలచ్చి

చరణం 1

విరజాజీ పూలబంతి అరసేత మోయలేని ||2||
సుకుమారి ఈ సిన్నదేనా...
శివుని విల్లు మోసిన జాన ఈ సిన్నదేనా
ఔరా... అని రామయ కన్నులు
నేలవాడి నవ్విన సిన్నెలు ||2||
సూసి అలకలొచ్చిన కలికి ||2||
ఏసినాది కులుకుల మొలికి ||సిగ్గూ||

చరణం 2

శిరసొంబి కోరుకున్న గురిసూసి సేరుతున్న ||2||
సిలకమ్మ కొనసూపు సౌరు బొండుమల్లె సెండుజోరు
ఏదే ఆ సూపుల తళుకు
ముసురుతున్న రామయ రూపు ||2||
మెరిసే నల్లమబ్బైనాది ||2||
వలపు జల్లు వరదైనాది ||సిగ్గూ||