ఆ... మపమపరి రిమరిమస ఆ...
మరల తెలుపనా ప్రియా మరల తెలుపనా ||2||
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని ||2||
కనుపాపల నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని ||మరల||
చరణం 1
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని ||2||
అణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని ||2||
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక చేతకాక మనసు పడే తడబాటుని... ||మరల||
చరణం 2
నిన్నలేని భావమేదో కనులు తెరచి కలయచూసి ||2||
మాటరాని మౌనమేదో పెదవి మీద ఒదిగిపోయే ||2||
ఒక క్షణమే ఆవేదన మరు క్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక మనసు పడే మధుర బాధ ||మరల||