ఘల్లుఘల్లున గుండె ఝల్లున
పిల్ల ఈడు తుళ్లిపడ్డది
మనసు తీరగ మాటలాడక
మౌనం ఎంచుకున్నది ||ఘల్లు||
చరణం 1
క్షణమాగక తనువుగెను
ఈ సంధ్యా సమీరాలలో...
అనురాగమే తలవూపెను
నీలాకాశ తీరాలలో ||క్షణమాగక|| ||ఘల్లు||
చరణం 2
కలగీతమై పులకించెను
నవ కళ్యాణ నాదస్వరం
కధ కానిది తుది లేనిది
మన హృదయాల నీరాజనం ||కలగీతమై|| ||ఘల్లు||