తూరుపు సింధూరపు...

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం హృదయగానం ||2|| ||తూరుపు||
మరల మరల ప్రతిఏడూ మధుర మధుర గీతం
జన్మదిన వినోదం ||మరల|| ||తూరుపు||

చరణం 1

వేలవేల వత్సరాల కేళిలో
మానవుడుదయించిన శుభవేళలో ||వేనవేల||
వీచె మలయమారుతాలు పుడమి పలికె స్వాగతాలు
మాలికలై తారకలే మలిచె కాంతి తోరణాలు...
ఓహో... హోయ్‌... ||తూరుపు||

చరణం 2

వలపులోన పులకరించు కన్నులతో
చెలిని చేరి పలుకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో
ప్రియుని చూసి పరవశించు ప్రియురాలు
జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం
ప్రేమంటే ఒక భోగంకాదు కాదు అది త్యాగం...
ఓ... హోయ్‌... ||తూరుపు||