కనులే కలిపే కధలే తెలిపే నాలోని భావాలే

కనులే కలిపే కధలే తెలిపే నాలోని భావాలే
అలలే మెదిలే కలలే కదిలే వేవేల రాగాలే
పలికే స్వరాలే ఎదకే వరాలై
పదాలు పాడు వేళలో కలవరమాయే మదిలో ||కనులే||

చరణం 1

మనసునే తొలి మధురిమలే వరించగా
బ్రతుకులో ఇలా సరిగమలే రచించగా
స్వరములేని గానం మరపురాని వైనం
మౌన వీణ మీటుతుంటే కలవరమాయే మదిలో

చరణం 2

ఎదగనీ కలే ఎదలయలో వరాలుగా
తెలుపనీ అదే తపనలనే తరాలుగా
నిదురపోని తీరం మధురమైన భారం
గుండె ఊయలూపుతుంటే కలవరమాయే మదిలో ||కనులే||