బ్రహ్మ కడిగిన పాదము...

బ్రహ్మ కడిగిన పాదము ||6||
బ్రహ్మము తానె నీ పాదము ||బ్రహ్మ||

చరణం 1

చెలగి వసుధ గొలిచిన నీ పాదము
బలితల మోపిన పాదము ||చెలగి||
తలకక గగనము తన్నిన పాదము ||2||
బలరిపు గాచిన పాదము ||తలకక|| ||బ్రహ్మ||

చరణం 2

కామిని పాపము కడిగిన పాదము
పాము తలనిడిన పాదము ||కామిని ||
ప్రేమతో శ్రీసతి పిసికెడి పాదము ||2||
పామిడి తురగపు పాదము ||ప్రేమపు|| ||బ్రహ్మ||

చరణం 3

పరమ యోగులకు పరిపరి విధముల
పరమోసగెడి నీ పాదము ||పరమ||
తిరు వేంకటగిరి స్థిరమని చూపిన ||2||
పరమ పదము నీ పాదము ||తిరు|| ||బ్రహ్మ||