చిట్టినడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా

చిట్టినడుమునే చూస్తున్నా చిత్రహింసలో చస్తున్నా
కంటపడదు ఇక ఎదురేమున్నా...
చుట్టుపక్కలేమౌతున్నా గుర్తుపట్టనే లేకున్నా
చెవిన పడదు ఎవరేమంటున్నా
నడుమే ఉడుమై నను పట్టుకుంటె జాణా
అడుగే పడదే ఇక ఎటుపోదామన్నా
ఆ మడతలో మహిమేమిటో వెతకాలి తొంగిచూసైనా
ఆ నునుపులో పదునేమిటో తేల్చాలి తప్పు చేసైనా
come on come on ||3||
ఓరి ఆ దేవుడా I think I did it again
I think I seen it again
your నడుముని చూసి frooty girl
I am losing all my concentration in this world
I am unable to suttay malaitay girl
Now look what I am running away with u pearl
If ur my MT
I am ur naidu baba naidu baba ||come on||

చరణం 1

నంగనాచిలా నడుమూపి నల్ల తాచులా జడచూపి
తాకి చూస్తే కాటేస్తానంది
చీమ లాగ తెగ కుడుతుంది పాములాగ పగబడుతుంది
కళ్ళుమూసినా ఎదరేవుంది...
తీరా చూస్తే నలకంత నల్లపూస
ఆరా తీస్తే నను నమిలేసే ఆశ
కన్నెర్రగ కందిందిలా నడువొంపుల్లో నలిగి
ఈ తిక మక తీరేదెలా ఆ సొంపుల్లో మునిగి
ఓరి ఆ దేవుడా ||I think||

చరణం 2

ఎన్ని తిట్టినా వింటానే కాలదన్నినా పడతానే
నడుము తడమనీ నన్నొకసారీ
ఉరిమిచూసినా ఒకే నే ఉరే వేసినా కాదననే
తొడిమి చిదిమి చెబుతానే సారీ
హాయిరే హాయిరే ఏ ప్రాణ హాని రానీ
హాయిరే హాయిరే ఇక ఏమైనా కానీ
నిను నిమరక నా పుట్టుక పూర్తవదు కదా అలివేణి
ఆ కోరిక కడతేరగ మరు జన్మ ఎందుకే రాణి ||come on||