నీలిమేఘవర వర్ణ నిగమ నిగమాంత నిజ నివాసా

నీలిమేఘవర వర్ణ నిగమ నిగమాంత నిజ నివాసా
శరత్ఛంద్రికా సౌమ్య సౌందర్య చారు చంద్రహసా
మధుర మధుర మణికుండల మండిత దండ యుగలికాసా
పద్మ పత్రనయన పరమాత్మ పాహి చిద్విలాసా పాహి చిద్విలాసా... ||2||
అల వైకుంఠము వీడి నను గూడి ఆటలాడగ వచ్చితివా
ప్రేమ మీరగా రంగా అని పేరుపెట్టి నన్ను పిలిచితివా
తల్లి దండ్రుల సేవల మహిమ మరిచిన తనయునిపైనే అలిగితివా
శ్రీతమృదుల శ్రీ మాధవా శిలవైతివా శ్రీ కేశవా ఆ...
నా కోసం నా ఇంటికి వచ్చిన భువన మోహన భూహరణ
కనుల ఎదుట సాక్షాత్కరించిన కాననైతినే కవిహరణ
రాధా హృదయభృంగా రసమయ కరుణతురంగా
రారా అని నీ రంగనివ్రోష రాజాధిరాజా శ్రీ రంగా రంగా...పాండురంగా... ||2||