ఏమని అడగను ఏ వరము నిను కోరను

ఏమని అడగను ఏ వరము నిను కోరను
నీ దాసదాసానుదాసుడను, నీ ఎదుట నే మూగను కృష్ణా ఏమని అడగను
మొసలి బారి పడి మొరలిడిన గజేంద్రుని బాధలులేవు
రక్ష రక్షయని ప్రార్థించుటకు ద్రౌపది దుస్థితి లేదు
అటుకులిచ్చి సంపదలు తెమ్మనే అర్థాంగలక్ష్మీ లేనే లేదు ఆ...
అడగకున్నా అన్నీ యిచ్చే వాడే నా వాడని తెలిసే
ఏమని అడగను ఏ వరము నిను కోరను
కృష్ణా కృష్ణా కృష్ణా... ఏమని అడగను... ఆ...

చరణం

బంధమే లేని భగవంతుడు నీ అనుబంధానికి బంధితుడు
అందరిచేత అడిగించుకునేవాడు నిన్నడుగుతున్నాడు ఆ...
అంతా నువ్వే అంటాడయ్యా ఆ ఒక్కటేదో అడగవా
అమ్మా నీ కృష్ణయ్యా చిన్నప్పుడు మన్ను తిన్నాడని తెలిసి
నోరు చూపమంటే తన నోట పదునాలుగు భువనాలను
చూపించాడు కదమ్మా అప్పుడు ఆ యశోదమ్మ ఆశ్చర్యంతో
నోరు తెరిచి చూసిందే కానీ, నోరు తెరిచి ఏమైనా అడిగిందా తల్లీ ఆ...
మన్ను తిన్న ఆనోట అన్ని లోకాలను చూసిన యశోదమ్మ ఏవరమడిగిందమ్మా
వేణుగానమును విని ఆగోవులు తరించినవిగాని గోవిందుని ఏం కోరాయమ్మా
ముక్తికాంతుడగు ముకుందుడే... ||2||
నా యందు నిలిచి ఉన్నాడు, నా పంచప్రాణాలు
తులసిదళాలతో అర్చన చేస్తున్నాను
ఇంతకన్నా కావలసింది ఇంకేంఉందీ
అంతా తెలిసిన అంతర్యామిని అడిగేదేముంది