నను ప్రేమించానను మాట

నను ప్రేమించానను మాట
కలనైనా చెప్పేయ్ నేస్తం
కలకాలం బ్రతికేస్తా ||2||
పూవుల ఎదలో శబ్ధం
మన మనసులు చేసే యుద్ధం
ఇక ఓర్పదే నా హృదయం ||2||
సౌఖ్యమసౌఖ్యము పక్కపక్కనే
ఉంటే పక్కపక్కనే
చూపుకి రెండూ ఒక్కటే...
బొమ్మాబొరుసులు పక్కపక్కనే
చూసే కళ్లు ఒక్కటే అయినా రెండూ వేరేలే ||నను||

చరణం 1

రేయిని మలిచీ... ఓ... రేయిని మలిచీ
కనుపాపలుగా చేశావో కనుపాపలుగా చేశావో
చిలిపి వెన్నెలతో కన్నులు చేశావో ఓ...
మెరిసే చుక్కల్ని తెచ్చి
వేలి గోళ్ళుగా మలచీ
మెరుపును తీగను తెచ్చి
పాపిటగా మలిచావో...
వేసవి గాలులు పీల్చి వికసించే పువ్వులు తెచ్చి
మంచి గంధాలెన్నో పూసి మేనే మలిచావో
అయినా... మగువా మనసుని శిలగా చేసినావే ||నను||

చరణం 2

మనసుని తడిమీ నిదురలేపింది నీవేగా
నిదురలేపింది నీవేగా
వలపు మధురిమలు తెలిపింది నీవేగా
ఓ...గాలీ నేల నింగి ప్రేమ ప్రేమించే మనసు
వివరము తెలిపినదెవరో ఓ ప్రేమా నీవేగా
గంగై పొంగే మనసు కవితల్లే పాడుతు ఉంటే
తుంటరి జలపాతంలా కమ్ముకున్నది నీవేగా
అయినా...
చెలియా మనసుకి మాత్రం దూరమైనావే
కనులే... లేకా...
మనసుని మాత్రం వీడిపోయావే ||నను||