చేయి చేయి కలుపరావె హాయి హాయిగా
నదురు బెదురు మనకింక లేదు లేదుగా... ||2||
అహా... చేయి చేయి...
పెద్దవారి అనుమతింక లేదు లేదుగా
చేయి చేయి కలుపుటెలా హాయి హాయిగా... ||2||
ఉహు... చేయి చేయి...
చరణం 1
మగని మాటకెదురాడుట తగదు తగదుగా
నాతి చెంత విరహము నే తాళలేనుగా... ||2||
అహా... చేయి చేయి...
చరణం 2
వీలు కాని విరహమింక వలదు వలదుగా
దాసి మీద వలపు మీకు తగదు తగదుగా... ||2|| ||చేయి చేయి||