అహహ్హహహ్హహ్హ వివాహ భోజనంబు ఆహ్హహా
వివాహ భోజనంబు వింతైన వంటకంబు
వియ్యాలవారి విందు ఓహొ్హ్హొ నాకె ముందు ||2||
అహ్హహహ్హహహ్హ అహ్హహహ్హహహ్హ
అహ్హహహ్హహహ్హహా
చరణం 1
ఔరౌర గారెలెల్ల అయ్యారె బూరెలెల్ల ||2||
ఓహ్హొరే అరిసెలెల్ల అహ్హహహ్హహా
ఇవెల్ల నాకె చెల్ల ||వివాహ||
చరణం 2
భళీరె లడ్డులందు వహ్ ఫేణి పోణిలిందు ||2||
భలే జిలేబి ముందు అహ్హహహ్హహా
ఇవెల్ల నాకు విందు ||వివాహ||
చరణం 3
మఝూరే అప్పడాలు పులిహొర దప్పళాలు ||2||
వహ్హారే పాయసాలు అహ్హహహ్హహా
ఇవెల్ల నాకె చాలు ||వివాహ||