సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా

సుడిగాలిలోన దీపం కడవరకు వెలుగునా
సుడిగాలిలోన దీపం...

చరణం 1

లోకాన పన్నీరు జల్లేవులే
నీకేమొ కన్నీరు మిగిలిందిలే
పరవారి గాయాలు మాన్పేవులే
నీలోన పెనుగాయ మాయెనులే ||2||
అణగారిపోవు ఆశ నీవల్లనె పలికే... ||సుడిగాలిలోన||

చరణం 2

ఒక కన్ను నవ్వేటివేళలో
ఒక కన్ను చెమరించసాగునా...
ఒక చోట రాగాలు వికసించునా
ఒక చోట హృదయాలు ద్రవియించునా ||2||
ఎనలేని ప్రాణదానం ఎద బాధ తీర్చునా... ||సుడిగాలిలోన||

చరణం 3

కల్లోల పవనాలు చెలరేగునా
గరళాల జడివాన కురిపించునా
అనుకోని చీకట్లు తెలవారునా
ఆనంద కిరణాలు ఉదయించునా ||2||
విధికేమొ లీల అయినా...
మది బరువు మోయునా... ||సుడిగాలిలోన||