నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే

నిన్ను తలచి మైమరచా చిత్రమే అది చిత్రమే
నన్ను తలచి నవ్వుకున్నా చిత్రమే అది చిత్రమే ||2||
ఆ నింగి ఎన్నటికీ ఈ భూమి చేరదనీ
నాడు తెలియదులే ఈనాడు తెలిసెనులే ఓ చెలీ ||నిన్ను తలచి||

చరణం 1

ఆడుకుంది నాతో జాలి లేని దైవం
పొందలేక నిన్ను ఓడిపోయి జీవితం
జోరువానలోన ఉప్పునైతే నేనే
హొరుగాలిలోన ఊకనైతే నేనే
గాలిమేడలే కట్టుకున్నా చిత్రమే అది చిత్రమే
సత్యమేదో తెలుసుకున్నా చిత్రమే అది చిత్రేమే
కధ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే ||నిన్ను తలచి||

చరణం 2

కళ్లలోన నేను కట్టుకున్న కోట
నేడు కూలిపోయే ఆశ తీరుపూట
కోరుకున్న యోగం జారుకుంది నేడు
చీకటేమో నాలో చేరుకుంది చూడు
రాసివున్న తలరాత తప్పదు
చిత్రమే అది చిత్రమే
గుండెకోతలే నాకు ఇప్పుడు
చిత్రమే అది చిత్రమే
కధ ముగిసెను కాదా కల చెదిరెను కాదా అంతే ||నిన్ను తలచి||