పాహీ మహేశా - పాపవినాశా సేవకజన భవనాశా

పాహీ మహేశా - పాపవినాశా సేవకజన భవనాశా ||పాహీ||
చంద్రమకుట చర్మాంబరధారీ
ఇంద్రనీలగళహారీ సేవక జన శుభకారీ ||పాహీ||
అగణిత కరుణా - ఆశ్రిత శరణా,
నాగరాజు దివ్యాభరణా, సేవకజన భవతం
నిగమాంతనుతా, నిర్మల చరితా యోగివినా
మాంపాలయ శంభో, సేవక జన శుభకారీ ||పాహీ||