ఆ... ఆఆఆ... ఆఆఆ...
మేఘమా దేహమా.. మెరవకే ఈ క్షణం
మెరిసినా కురుసినా.. కరుగునే జీవనం.. ||మేఘమా||
చరణం 1
మెరుపులతో పాటు ఉరుములుగా
దనిరిసా రిమ దనిస దనిసగా
మూగబోయే జీవ స్వరములుగా
వేకువ జామున వెన్నెల మరకలుగా
రేపటి వాకిట ముగ్గులుగా.. ఆ..
స్మృతిలో మిగిలే నవ్వులుగా
వేసవిలో మంచుపల్లకిగా ||మేఘమా||
చరణం 2
పెనుగాలికి పెళ్ళిచూపు
పువ్వు రాలిన వేళ కళ్యాణం
అందాక ఆరాటం.. ఆశలతో పేరంటం
నాకొక పూమాల తేవాలి నువ్వు ||2||
అది ఎందుకో... ఓ ఓ... ||మేఘమా||