నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం

నువ్వే నాకు ప్రాణం నువ్వే నాకు లోకం
ప్రేమే రాగబంధం ప్రేమే వేదమంత్రం
కష్టాలెన్ని ఎదురైనా గాని
మనకున్న బలమే ప్రేమ ప్రేమా ||నువ్వేనాకు||

చరణం 1

నీలో ఆశ రేపే శ్వాస పేరే ప్రేమ కాదా
లోలో పల్లవించే పాట పేరే ప్రేమ కాదా
జీవితానికో వరం ప్రేమనీ
ప్రేమలేని జీవితం లేదనీ
ఒకటై పలికేనట ఈ పంచభూతాలు ||నువ్వేనాకు||

చరణం 2

నిన్ను నన్ను కలిపే వలపు పేరే ప్రేమ కాదా
మిన్ను మన్ను తడిపే
చిలిపి చినుకే ప్రేమ కాదా
లోపమంటూ లేనిదే ప్రేమనీ
ప్రేమ నీకు శాపమేం కాదనీ
ఎదలో పలికేనట కళ్యాణ రాగాలు ||నువ్వేనాకు||