మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం

ఆ.. ఆ.. ఆ..
మధురమే సుధాగానం మనకిదే మరోప్రాణం
మదిలో మోహనగీతం మెదిలే తొలి సంగీతం ||2|| ||మధురమే||

చరణం:1

చరణాలు ఎన్నివున్నా పల్లవొకటే కదా
కిరణాలు ఎన్నివున్నా వెలుగొక్కటే కదా
శతకోటి భావాలను పలుకు ఎదమారునా
సరిగమలు మారుతున్నా
మధురిమలు మారునా ||మధురమే||

చరణం:2

వేవేల తారలున్నా నింగి ఒకటే కదా
ఎన్నెన్ని దారులున్నా గమ్యమొకటే కదా
ఎనలేని రాగాలకు నాదమొకటే కదా
అనుభూతులెన్నివున్నా
హృదయమొకటే కదా ||మధురమే||