మాదీ స్వతంత్ర దేశం మాదీ స్వతంత్ర జాతి (2)
భారతదేశమే మాదేశం
భారతీయులం మా ప్రజలం (2) ||మాదీ||
చరణం : 1
వింధ్య హిమవత్ శ్రీ నీలాదుల
సంధ్యారుణిత నవాశలు మావి
గంగా గోదావరీ సహ్యజా
తుంగతరంగిత హృదయాల్ మావి (2) ||మాదీ||
చరణం : 2
ఆలయమ్ముల శిల్పవిలాసం
ఆరామమ్ముల కళాప్రకాశం (2)
మొగల్ సమాధుల రసదరహాసం
మాకు నిత్యనూతనేతిహాసం ||మాదీ||
చరణం : 3
అహింసా పరమో ధర్మః
సత్యం వధ ధర్మం చర... (2)
ఆది ఋషుల వేదవాక్కులు
మా గాంధి గౌతముల సువాక్కులు (2) ||మాదీ||