బంతీ చామంతి ముద్దాడుకున్నాయిలే
మల్లీ మందారం పెళ్ళాడుకున్నాయిలే
నిద్దరనీ సెలవడిగీ ఇద్దరినీ కలవమని ||2|| ||బంతీ||
చరణం 1
తేనె వాగుల్లో మల్లెపూలల్లే తేలిపోదాములే
గాలి వానల్లో మబ్బు జంటలై రేగిపోదాములే
విసిరే కొనచూపే ముసురైపోతుంటే
ముసిరే వయసుల్లో మతి అసలే పోతుంటే
వేడెక్కి గుండెల్లో తల దాచుకో
పాదాలలో ఉన్న తడి ఆర్చుకో
ఆకాశమంటే ఎదలో జాబిల్లి నీవే వెన్నెల్లు తేవే ||బంతీ||
తారతా... తరరా తరరా... ||2||
చరణం 2
పూత పెదవుల్లో ముద్దు గోరింకా
బొట్టు పెట్టిందిలే
ఎర్ర ఎర్రంగా కుర్ర బుగ్గల్లో సిగ్గు తీరిందిలే
ఒదిగే మనకేదో ఒకటై పొమ్మంటే
ఎదిగే వలపంతా ఎదలొకటై రమ్మంటే
కాలాలు కరిగించు కౌగిళ్ళలో
దీపాలు వెలిగించు నీ కళ్ళతో
ఆ మాట వింటే కరిగే
నా ప్రాణమంతా నీ సొంతమేలే ||బంతీ||