ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి
సొగసులై బృందావని విరిసె నా సిగలోనికి
జత వెతుకు హృదయానికి శ్రుతి తెలిపె మురళీ
చిగురాకు చరణాలకి సిరిమువ్వ రవళీ
రసమయం జగతి
ఉరకలై గోదావరి ఉరికె నా ఒడిలోనికి

చరణం 1

నీ ప్రణయభావం నా జీవరాగం ||2||
రాగాలు తెలిపే భావాలు నిజమైనవి
అనురాగ రాగాల స్వరలోకమె మనదైనది ||ఉరకలై||

చరణం 2

నా పేద హృదయం నీ ప్రేమ నిలయం ||2||
నాదై బ్రతుకే ఏనాడో నీదైనది
నీవన్న మనిషే ఈనాడు నీదైనది
ఒక గుండె అభిలాష పదిమందికి బ్రతుకైనది ||ఉరకలై||