సాల్సా ఇద సాల్సా

పల్లవి

[ఆమె] సాల్సా ఇద సాల్సా హై క్లాసు డాన్సు సాల్సా
[అతడు] హంస కలహంస ఈ డ్రిల్ పేరు డాన్సా
[ఆమె] సాల్సా మాసాల్సా నీ వల్ల కాదు తెల్సా
[అతడు] స్టెప్సా అవి ఫిట్సా మాకెందుకింత హింసా
[ఆమె] నోటికొచ్చినట్టు పిచ్చి కామెంట్సా
[అతడు] అరె ఉన్నమాటి చెప్పుకుంటె ఫీలింగ్సా
[ఆమె] నిను బొట్టుపెట్టి పిలిచినట్టు జోలికొచ్చి ఏంటిరభసా
[అతడు] మాతో పెట్టుకోకు మాతో రెచ్చిపోకు పిచ్చికా మేంతీర
మారత్తుకుంటే తోకే ముడుచుకోవాపిచ్చుకా ||సాల్సా||

చరణం 1

షర్టు కొంచెం మడిచికట్టి నాలుకిట్టా మడతపెట్టి దుమ్ము రేపే బస్తీలే మావిలే
[ఆమె] ఒకటి రెండు లెక్కపెట్టి బీటుమీద మనస్సుపెట్టి స్వింగు చెయ్యడం ఈజి కాదులే
[అతడు] చాల్లే బడాయేలే నైసు పాపా ఊరికేలడాయేలా పట్టుకోకా
యాలో కలేజాలు ఓర్చలేకా ఏవోకహానీలు చెప్పమాకా
[ఆమె] గల బాకులోకి గయ్యమంది రామ రామ మీరా మేమా ||సాల్సా||

చరణం 2

టింగురంగా ఇంగ్లీషు ఎంగిలాట లెందుకంటా కింగు లాంటి మాస్టైలే నేర్చుకో
[ఆమె] ఊర నాటు చిల్లరాట అంత సీనులేనిదంటూ బీరపాంటు మేళాలే మానుకో
[అతడు] లోకల్ డాన్సు మీకులోకువెందుకే ఫారన్ జాబుమీద
మొజా దేనుకో వెస్టెన్ టేస్టులోని ఎక్కువేమిటో మేడిన్ ఆంధ్రకబ్నా తక్కువేమిటో
[ఆమె] నీ బ్రైను వాషు చాలు చాలు వెస్ట్‌టేస్టు మాదేననుకో ||సాల్సా||