పల్లవి
జయదేవ
హే కరుణాసింధో! హే దీనబంధో
దయ గనుమా జగదీశా
దయగనుమా జగదీశా||
వెన్నలుదిన్నా నీ మనసేలా రాయిగ మారెను దేవా ! ||దయ||
చరణం 1
చేతుము జతగూడి నీ పాదసేవ !
పాడేము నీ దివ్య శృంగారగీతి !
తీగెలుతెగినా ! జీవనవీణ ! మ్రోగునయికనైన ||దయ||
చరణం 2
గురుదేవు బాలుని ప్రాణమొసగిన దాతలే !
అభిమన్యు సూనుని కావనేర్చిన త్రాతలే !
మాపైన జాలిని బూనవా ?
ప్రియదాసి బ్రోవగ నేరవా?
కరుణించుమా ! బ్రతికించుమా ! బ్రతికించుమా