రారా . . . రారా

పల్లవి

[అతడు] రారా ... రారా ఎక్కడ పోతావ్‌ రా
నువ్వెక్కడ పోతావ్‌రా ఇంకెక్కడ పోతావ్‌ రారా
[ఆమె] రా ... రా ...
రారా రాజాకుమార్‌ రా మయాబజార్‌ రా
నీ భాజా భలే రా రా
[అతడు] నీ ఉట్టి నేనే కొట్టి నీ చట్టీ నేనే పట్టి
నీముంతా పాలు వెన్నా అంతా గల్లంతేగా
[ఆమె] నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . . రారా||

చరణం 1

[అతడు] ఓ జగిత చిల్లరగిత్తా సోకులసొత్తా మేనత్తా
మాంతా మన్మధగీత తల్లోరాతా
[ఆమె] ఓ కుర్రోడా బందరు లడ్డా బంగరు గుడ్డా పిల్లోడా
చిక్కిన నా గుర్రపునాడా ఊదేనా గోడ
[అతడు] నీ గుట్టే చెంగల్‌‌పట్టు నీ పట్టే గొంగళ్‌ పట్టు
ఆమ్‌ పట్టు తేనెపట్టు నీ గుట్టు
[ఆమె] వీధి యేటి గట్టు కస్తూరి చుక్కాబొట్టు
దమ్ముంటే కొల్లగొట్టు దణ్ణంపెట్టు
[అతడు] నీ చొక్కా నేనే కట్టా నామస్కా నీకే కొట్టా
ఛీపో చిన్నారి పిట్టా నీతో గుడ్డే పెట్టా
నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . . రారా||

చరణం 2

ఓ రాకాసి రంగులు పూసి మాయలు చేసి దోచేస్తే
పంపిస్తా ఉత్తర కాశి వారణాశి
[ఆమె] ఓ రబ్బాయి పీచు మీఠాయి భామల చేయి
చురుకోయి పోవోయి చాలుబడాయి దౌడేతీయి
[అతడు] ఎత్తైన గాసంగంతై ఒంటరిగా టర్కేపగబై
ఆ రెండూ నీలో ఉన్నయ్‌ నువ్వే చెన్నై
[ఆమె] ఇది నీలో గోలజాడ నీకళ్ళకు కమ్మని బాడ
మధురైలో మల్లెలవాన లేనా లేనా
[అతడు] అందాల ఆలుపూరి దిల్లుంటే రావేపోరి
గిల్లేస్తా నీలో చోరి హోరాహోరి
[ఆమె] నాన్‌ బెల్లంగోరు వాసి నా టపాంగుత్తులాడా
రేపల్లే వీధుల్లోనే నా చెల్లా చిందిలేలేలా ||రారా . . .రారా||