ఓం నమః శివాయ

పల్లవి

ఓం నమః శివాయ ఓం నమః శివాయ
హారతి యిదే హారవరద సదా
శివ నటనరాజ శంకరహే ||హారతి||
మకుటము శశియై మెరయు మహేశా
మంగళ మూర్తివి హే పరమేశా
స్తుతిచే అంబిక వేడ చిదంబర
తాండవ మాడిన భవహే ||హారతి||
కరుణా భరణ మహొన్నతశిలా
అద్భుతమే ఫణి భూషణహేలా
అఖిల చరాచర సుగుణ సమూహ
అంబిక నాధా సుందరహే
మహాదేవ జై - జై శివశంకర
జై దేవాదిదేవ పరాత్పర
కరుణతో బ్రోవవె వరదా ||హారతి||