పల్లవి
సదానందస్వామి, శిష్యులు - ప్రార్థన
హర! హర! పురహర! శంభో!
హిమ ధరణీధర రాజనందినీ
హృదయాధినాధ ! మహాదేవ!
త్రిభువన మోహన తాండవ లోలా!
దేవాదిదేవా! శూలధరా!
కైలాస నాయక|| కైవల్య మందార!||
ఆనంద గంగా తరంగాతరంగ ||హర హర||
అరుణ ఘనా ఘనా జటామండలి
తరుణేందు కళభరణా!
నాగేంద్ర కేయూర! నటరాజ రాజ!
జయవీర జయవీర - జయ మహావీర!